News September 4, 2024
నొప్పులు, గాయంతోనే తారక్ డాన్స్: రత్నవేలు
‘దేవర’ నుంచి తాజాగా రిలీజైన దావూదీ సాంగ్‌లో ఎన్టీఆర్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ స్టెప్స్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కండరాల నొప్పులు, గాయాలతో బాధపడ్డారని ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్విటర్లో తెలిపారు. ‘అంత నొప్పిలోనూ తారక్ చాలా అలవోకగా డాన్స్ వేసేశారు. ఆయనకు హ్యాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు. ‘దేవర’ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Similar News
News February 3, 2025
SECకి వైసీపీ ఫిర్యాదు
AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తిరుపతి, హిందూపురం, నెల్లూరులో వైసీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు దాడి చేశారని, ఆ ఎన్నికలను వాయిదా వేయాలని విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నేతలు వినతిపత్రం అందించారు.
News February 3, 2025
ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా, త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
News February 3, 2025
సూపర్ ‘నాన్న’.. ప్రాణాలకు తెగించి కొడుకును కాపాడాడు
TG: కొడుకు ఆపదలో ఉంటే రక్షించడానికి తండ్రి తన వయసును, ప్రాణాన్ని సైతం లెక్కచేయడు. అందుకే నాన్న సూపర్ హీరో. తాజాగా సిద్దిపేట(D) చిట్టాపూర్‌లో పొలానికి వెళ్లిన మల్లయ్య పొరపాటున కూడవెల్లి వాగులో పడిపోయాడు. తండ్రి నారాయణ(75) వెంటనే వాగులోకి దూకి కొడుకును కాపాడాడు. అపస్మారకస్థితిలోకి చేరిన మల్లయ్యను కుటుంబసభ్యుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.