News May 15, 2024
తారక్ బర్త్ డే.. ‘దేవర’ నుంచి సాంగ్ రిలీజ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానుల్లో జోష్ నింపేందుకు ‘దేవర’ మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బర్త్ డే గిఫ్ట్‌గా సినిమా టైటిల్ సాంగ్ లేదంటే టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎక్కువ శాతం సాంగ్ రిలీజ్‌కే మేకర్స్ మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనిరుధ్ అందించిన మ్యూజిక్‌కు సాంగ్ అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. NTR సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు.
Similar News
News March 16, 2026
ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 11.45AMకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈ నెల 20న బడ్జెట్‌ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కొత్త హాల్‌లో శాసనమండలి కొలువుదీరనుంది. నేడు గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.