News February 1, 2025

2047కల్లా 100 GW అణు విద్యుత్ లక్ష్యం: నిర్మల

image

2047కల్లా కనీసం 100 గిగావాట్ల అణువిద్యుత్‌ను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘చిన్న చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రూ.20వేలకోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ రంగంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2025

వాట్సాప్‌లోనే ‘మీ సేవ’లు!

image

TG: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పదేపదే మీ-సేవ సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ వాట్సాప్‌ ద్వారానే అందించనుంది. మీ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందిందా? లేదా? అప్రూవ్ అయితే సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ఈ సేవలను లాంచ్ చేయనున్నారు.

రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు 16వ ఆర్థిక సంఘం తన నివేదికను అందించింది. నికర పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు మధ్య పంపిణీ వాటాలు, ఇతర అంశాలపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంటుంది. సంఘం సిఫార్సులను ఆర్థిక శాఖ పరిశీలించి బడ్జెట్లో ప్రవేశపెడుతుంది. 2026 ఏప్రిల్1 నుంచి 5 ఏళ్లపాటు ఈ సంఘం సిఫార్సులు అమలవుతాయి. కాగా 15వ ఆర్థిక సంఘం పన్ను ఆదాయంలో 41% STATESకు కేటాయించేలా సిఫార్సు చేసింది.