News August 26, 2025

టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్స్

image

భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి 50% టారిఫ్స్ అమల్లోకి రానుండటం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 81,061, నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,793 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, HUL, హీరో మోటోకార్ప్, TCS లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రిక్, ICICI బ్యాంక్, Airtel నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News August 26, 2025

సాదియా అంకితభావం యువతకు స్ఫూర్తి: లోకేశ్

image

AP: IPF వరల్డ్ క్లాసిక్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ కాంస్య పతకం సాధించారు. ఆమెకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించారు. దేశంతో పాటు మన మంగళగిరికి గర్వకారణంగా నిలిచారు. ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు.

News August 26, 2025

సెప్టెంబర్ 12న ‘మిరాయ్’ విడుదల

image

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈనెల 28న సరికొత్త ట్రైలర్‌తో అభిమానులను అలరిస్తామని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఫాంటసీ డ్రామా ఏడు భాషల్లో విడుదల కానుంది.

News August 26, 2025

విద్యుత్ ప్రమాదాలను నివారిద్దామిలా!

image

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ షాక్స్ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇంట్లోని అతుకులున్న వైర్ల నుంచి విద్యుత్ పాస్ అయ్యే ప్రమాదం ఉంది. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకొద్దు. ప్లగ్స్, సాకెట్స్‌కు కవర్‌లు ఉండేలా చూసుకోండి. పిల్లలు వీటిని తాకకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లోకి వరద వస్తే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయాలి’ అని తెలిపారు.SHARE IT