News September 26, 2025

టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ఫార్మా షేర్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. US ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా ప్రొడక్ట్స్‌పై 100% టారిఫ్స్ విధించనున్నట్లు ప్రకటించడంతో ఫార్మా కంపెనీల షేర్లు దాదాపు 4% మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 381 పాయింట్ల నష్టంతో 80,778, నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయి 24,779 వద్ద ట్రేడవుతున్నాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News February 9, 2026

రెండేళ్లలో ఇద్దరు పిల్లలు.. తల్లులపై తీవ్ర ప్రభావం

image

వెంటవెంటనే ఇద్దరు పిల్లలను కనడం తల్లులపై తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి శరీరం పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చడం వలన అలసట, రక్తహీనత, నిద్రలేమి, డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరి పిల్లల మధ్య కనీసం 18 నెలల నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు తోబుట్టువుల మధ్య బాండ్ బలంగా ఉంటుందని సూచిస్తున్నారు.

News February 9, 2026

అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

image

నటి, డాన్సర్ సుధా చంద్రన్‌ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.