News August 28, 2025
టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్స్

అమెరికా టారిఫ్స్ అమల్లోకి రావడంతో వరుసగా రెండో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ Sensex 705 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద, Nifty 211 పాయింట్ల నష్టంతో 24,500 వద్ద స్థిరపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్, TCS, ఇన్ఫోసిస్, HDFC, ICICI, ఇండస్ ఇండ్, ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. టైటాన్, లార్సెన్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.
Similar News
News August 29, 2025
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. మరొకరు అరెస్ట్

AP: విజయనగరం ఐసిస్ ఉగ్ర కుట్ర కేసులో బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అరెస్టయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు NIA వెల్లడించింది. గతంలో <<16451593>>అరెస్టైన <<>>నిందితులు సమీర్, సిరాజ్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలున్నాయని గుర్తించింది. వీరంతా కలిసి ఉగ్రదాడులకు కుట్ర పన్నారని, జిహాదీ కార్యక్రమాల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించినట్లు NIA తెలిపింది.
News August 29, 2025
కుప్పంలో ఐఫోన్ చాసిస్ తయారీ ప్లాంట్: TDP

APలో రూ.586 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హిందాల్కో సంస్థ ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. ‘ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్‌లు, భాగాలు, పీసీబీలు కుప్పంలోనే తయారుకానున్నాయి. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో రాష్ట్రం కీలకంగా మారుతుంది. హిందాల్కో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. 2027 నాటికి పూర్తయ్యే ఈ యూనిట్‌తో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి’ అని ట్వీట్ చేసింది.
News August 28, 2025
ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకూడదు: సీఎం రేవంత్

TG: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ‘వాగులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి. ఫొటో, వీడియో క్యాప్చర్ ద్వారా పంట నష్టం అంచనా వేయాలి. సమగ్ర వివరాలను భద్రపరచాలి. వర్షపాతం వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.