News April 24, 2024
తస్లిమా ఆస్తులు రూ.10 కోట్లు!

TG: గత నెల లంచం <<12905500>>తీసుకుంటూ<<>> దొరికిపోయిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో భవనాలు, రూ.2.94 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటి మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. Sarwar ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు.
Similar News
News October 21, 2025
సైబర్ క్రైమ్ గ్యాంగ్ లీడర్.. కేరాఫ్ చాయ్‌వాలా

బిహార్‌లో అభిషేక్ కుమార్ అనే చాయ్‌వాలా అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్వర్క్ లీడర్‌గా తేలాడు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ ఇంట్లో సోదాలు చేపట్టి రూ.1.05 కోట్ల నగదు, 344గ్రా. గోల్డ్, 1.75KGs సిల్వర్ సీజ్ చేశారు. 85 ATM కార్డులు, 75 బ్యాంక్ పాస్‌బుక్స్, 28 చెక్‌బుక్స్, ఆధార్ కార్డ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, లగ్జరీ కారు స్వాధీనం చేసుకున్నారు.
News October 21, 2025
బీపీ కంట్రోల్లో ఉండాలంటే..

వయసుతో సంబంధం లేకుండా చాలామంది హై బ్లడ్ ప్రెషర్(బీపీ)తో బాధపడుతున్నారు. ఉదయమే కొన్నిరకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకోవడం, బీట్రూట్ జ్యూస్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ, ఉసిరి జ్యూస్ వంటి వాటిలో నిత్యం ఏదో ఒకటి తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT
News October 21, 2025
ఇలా చేయడం అమంగళకరం

కొన్ని అలవాట్లు, చర్యలను మానకపోతే జీవితంలో అశుభాలు కలుగుతాయని మన సంస్కృతి చెబుతోంది. నాలుక తడితో బొట్టు పెట్టుకోవడం, కాళ్లు దాటి వెళ్లడం, వడ్డించినా భోజనానికి రాకపోవడం, కంచాన్ని ఒళ్లో పెట్టుకొని తినడం, కాళ్లు ఊపడం, స్నానం చేసిన తర్వాత విడిచిన దుస్తులనే వేసుకోవడం, బొట్టు పెట్టుకోకపోవడం వంటి కొన్ని పనులు దోషప్రదమని పండితులు చెబుతున్నారు. వీటిని వీడితే జీవితంలో సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు.