News October 10, 2024
టాటా కార్లు.. ప్రయాణికుల భద్రతే ప్రధానం

ఎన్నో రంగాలకు విస్తరించినా ‘టాటా’ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కార్లే. టాటా ఇండికా మొదలుకొని, నానో వరకు ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది. అందులో రతన్ టాటా కృషి ఎనలేనిది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు టాటా అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదటి 5/5 రేటింగ్ సాధించిన కారు టాటా నెక్సాన్. దీని సృష్టికర్త రతన్ టాటానే.
Similar News
News November 14, 2025
ఆ ఎకరం.. పోషకాల వరి వంగడాలకు నిలయం

యాదగిరి శ్రీనివాస్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సేద్యం చేస్తున్నారు. తనకు 3 ఎకరాల భూమి ఉండగా 2 ఎకరాల్లో సాధారణ రకాలను, మరో ఎకరంలో 400 వరి రకాలను సాగు చేస్తున్నారు. మంచి పోషక విలువలతో కూడిన తులసి బాసో, ఇతర ఎర్ర, నల్ల వరి రకాలు కూడా శ్రీనివాస్ భూమిలో పండుతున్నాయి. అవసరం మేరకు విత్తనాలను భద్రపరిచి.. ఆసక్తి ఉన్న రైతులకు విత్తనాలను అందిస్తూ, మిగిలిన వాటిని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు.
News November 14, 2025
250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కేబినెట్ సెక్రటేరియట్ 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, MScతో పాటు GATE ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NOV 15 నుంచి DEC 14 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66

ఈరోజు ప్రశ్న: వేద వ్యాసుని ద్వారా జన్మించిన వారిలో ధృతరాష్ట్రుడు, పాండురాజులతో పాటు విదురుడు కూడా ఒకరు. కానీ, ఆయన హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా, కేవలం రాజభవనంలో ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


