News October 8, 2025

టాటా గ్రూప్ వివాదాలకు త్వరలో తెర!

image

టాటా గ్రూపులో తలెత్తిన వివాదాలకు త్వరలోనే తెరపడనుందని సమాచారం. గ్రూపులోని టాటా, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాజీకి వస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. టాటా సన్స్‌లోనూ డైరెక్టర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వీటన్నింటిపై అమిత్ షా, నిర్మల సమక్షంలో చర్చలు జరిగాయి. తీవ్ర ప్రభావం చూపించేలా మారిన విభేదాల్ని వీడాలని వారు స్పష్టంచేశారు. రతన్ టాటా మృతి తర్వాత గ్రూపులో విభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు.

Similar News

News October 8, 2025

హైకోర్టు నుంచి సీఎం ఇంటికి మంత్రులు, ఏజీ

image

TG: BC రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేలకపోవడంతో CM రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి AG, లాయర్లు, మంత్రులను తన నివాసానికి రావాలని సూచించారు. రేపు కోర్టులో వాదనలు, ఎలాంటి తీర్పు ఉండబోతుందనే తదితర అంశాలను చర్చించనున్నారు. అటు విచారణ వాయిదా పడటంతో SEC నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కోర్టు ప్రాంగణంలోనే ఏజీతో మంత్రుల బృందం సమావేశమైంది.

News October 8, 2025

మహిళల్లోనే డిప్రెషన్ అధికం.. కారణమిదే!

image

సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో డిప్రెషన్ రెట్టింపు ఉంటుంది. ఇందుకు జీన్స్(జన్యువులు) కారణమని తాజా అధ్యయనం తెలిపింది. పురుషుల కంటే మహిళల్లో 6,000 జీన్ వేరియంట్స్ అదనంగా ఉంటాయని ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో పబ్లిష్ అయిన స్టడీ పేర్కొంది. జనరిక్ ఫ్యాక్టర్స్ వల్లే ఉమెన్స్‌లో డిప్రెషన్‌ రిస్క్ పెరుగుతుందని వెల్లడించింది. ఈ జీన్ వేరియంట్స్ వారసత్వంగా లేదా సహజంగా కూడా ఏర్పడతాయంది.

News October 8, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* అమరావతిలో CRDA ప్రాజెక్టు కార్యాలయాన్ని ఈనెల 13న 9.54AMకు ప్రారంభించనున్న CM చంద్రబాబు
* లిక్కర్ స్కాం కేసు: MP మిథున్ రెడ్డి పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని సిట్‌కు ACB కోర్టు ఆదేశం.. US జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ ఇప్పించాలని కోరిన MP
* 21 మందితో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీని నియమించిన ప్రభుత్వం
* రాష్ట్రంలో 274 రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం