News October 12, 2025

దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

image

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

Similar News

News October 12, 2025

పాప్ స్టార్‌తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

image

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్‌లో పెర్రీ రద్దు చేసుకున్నారు.

News October 12, 2025

58 మంది పాక్ సైనికులు హతం: తాలిబన్ ప్రతినిధి

image

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని PAKను హెచ్చరించారు. పాక్ కాబూల్‌లోని ఓ మార్కెట్‌లో బాంబు దాడి చేసినట్లు ఆరోపించారు. దీనికి పాక్ ధ్రువీకరించాల్సి ఉంది.

News October 12, 2025

ప్రజల్లో ‘కల్తీ’ భయం!

image

దేశంలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకు పాలు, మద్యం, నిత్యవసరాలు, మెడిసిన్ కల్తీ అవడం చూస్తోండగా తాజాగా <<17975023>>Colgate<<>> ఘటన కలవరపరుస్తోంది. పనీర్, ఈనో, సెన్సోడైన్ వంటివి కూడా కల్తీ అవడం ఈ మధ్యకాలంలో వెలుగుచూశాయి. రసాయనాలు, నాసిరకం పదార్థాలతో వీటి తయారీ ప్రాణాలపైకి తీసుకొస్తుంది. దీంతో ఏది కల్తీనో ఏదీ నిజమైనదో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.