News August 1, 2024

క్యూ1లో దూసుకెళ్లిన టాటా మోటార్స్‌

image

FY25 తొలి త్రైమాసిక ఫలితాల్లో టాటా మోటార్స్ రాణించింది. నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 74% వృద్ధి చెంది ₹5,566 కోట్లుగా నమోదైంది. ఆపరేషన్స్‌కు సంబంధించి ₹1,07,316 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. FY24 క్యూ1తో పోలిస్తే 5.7% వృద్ధి రికార్డ్ అయింది. అంచనాలకు మించి నికర లాభం నమోదు కావడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూ1లో ఐటీసీ ₹4,917 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Similar News

News April 3, 2026

ఈ క్షీరదం పాలు నీటిలో కలిసిపోవు!

image

సముద్రపు వింతల్లో తిమింగలం పాలు ఒకటి. ఇవి ఆవు పాలలా పల్చగా ఉండవు. వెన్న మాదిరిగా గట్టిగా ఉంటాయి. ఇందులో 50% కొవ్వు ఉండటమే దీనికి కారణం. ఈ చిక్కదనం వల్ల పాలు నీటిలో కలిసిపోవు. దీనివల్ల తిమింగలం పిల్లలు నీటి అడుగున కూడా సులభంగా పాలు తాగగలుగుతాయి. ఈ అధిక కొవ్వు సముద్రపు చలిని తట్టుకోవడానికి అవసరమైన శక్తిని పిల్లలకు అందిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (37/100)

News April 3, 2026

నెలవంకలా భూమి.. అద్భుతమైన ఫొటో

image

భూమిపై నుంచి చంద్రుని నెలవంక అందంగా ఉంటుంది. అలాగే ఆకాశం నుంచి మన భూమి నెలవంక మహాద్భుతంలా ఉంటుందని పై ఫొటో చూస్తే తెలుస్తోంది. ఇటీవల నాసా ప్రయోగించిన <<19555072>>ఆర్టెమిస్-2<<>> వేలాది మైళ్ల ఎత్తు నుంచి ధరణి ఫొటోలను క్లిక్ మనిపించింది. నెలవంకలా దర్శనమిస్తోన్న ఈ చిత్రాలు SMలో వైరలవుతున్నాయి.

News April 3, 2026

హార్ముజ్‌ను సులభంగా తెరవొచ్చు: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ఇంకొంత సమయం ఉంటే హార్ముజ్ జలసంధిని మనం సులభంగా ఓపెన్ చేయవచ్చు. అక్కడి నుంచి ఆయిల్‌ను తీసుకెళ్లిపోయి భారీగా లాభాలు తెచ్చుకోవచ్చు. ప్రపంచానికి ఇది ఒక పెద్ద చమురు ప్రవాహం లాంటిది అవుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.