News October 10, 2024

టాటా రిక్వెస్ట్: మూడు రోజుల్లో పరిష్కరించిన మోదీ

image

2008లో బెంగాల్‌ నుంచి ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు PM మోదీ 3 రోజుల్లోనే తమ స‌మ‌స్యను ప‌రిష్క‌రించారని ర‌త‌న్ టాటా గతంలో గుర్తు చేసుకున్నారు. అప్ప‌టి గుజ‌రాత్ CMగా ఉన్న మోదీ త‌మ‌ను ఆహ్వానించారని, స్థలం కేటాయిస్తే తప్పక వస్తామని చెప్పామన్నారు. అప్పుడు 3 రోజుల్లో స్థలం కేటాయిస్తామని చెప్పి మోదీ మాట నిలుపుకున్నారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం కోసం ఆయ‌న నిజాయితీగా ప‌నిచేశార‌న్నారు.

Similar News

News July 9, 2025

నేడు స్కూళ్లకు బంద్ ఉందా?

image

నేడు ‘భారత్ బంద్’ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. బంద్‌కు మద్దతుపై ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అటు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటిస్తాయి. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లు సైతం తెరిచే ఉండనున్నాయి. బంద్ ఉంటుందని తల్లిదండ్రులకు సైతం మెసేజ్ రాలేదు.

News July 9, 2025

రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

image

AP: MBA/MCA ప్రవేశాల కోసం నిర్వహించే ICET తొలి విడత కౌన్సెలింగ్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చని, 13 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. సీట్లు పొందిన విద్యార్థుల సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.

News July 9, 2025

హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

image

ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2026కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇంటర్నేషనల్ పాస్ పోర్టును కలిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది. యాత్రికులు hajcommittee.gov.in లేదా HAJ SUVIDHA మొబైల్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరణం, ఎమర్జెన్సీ మినహాయించి యాత్రను క్యాన్సిల్ చేసుకుంటే జరిమానా తప్పదని స్పష్టం చేసింది.