News October 29, 2024
టాటాలే స్ఫూర్తి.. రూ.20,000 కోట్లు దాతృత్వం

రియల్ ఎస్టేట్ దిగ్గజం అభిషేక్ లోధా కుటుంబం దాతృత్వ కార్యక్రమాల కోసం రూ.20,000 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. మాక్రోటెక్ డెవలపర్స్‌లో 18-19 శాతం వాటాను సేవా సంస్థ ‘లోధా ఫిలాంథ్రోపీ ఫౌండేషన్’కు బదిలీ చేస్తామంది. మహిళా సాధికారత, విద్య తదితర కార్యక్రమాలపై ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. ఈ విషయంలో తమకు టాటాలే ఆదర్శమని అభిషేక్ చెప్పారు.
Similar News
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.
News February 7, 2026
ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?
News February 7, 2026
చక్కటి నిద్ర కోసం సింపుల్ టిప్స్

*ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
*గదిలో చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఐ మాస్క్ ధరించాలి.
*రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు.
*పడుకోవడానికి 3-4 గంటల ముందు మద్యం సేవించవద్దు.
*రోజూ ఉదయం వ్యాయామం చేయడంతో పాటు ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.


