News October 18, 2024

టాటా మాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: మూర్తి

image

రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గుర్తుచేసుకున్నారు. ‘టాటా నిరుపేదలు, ఉద్యోగుల గురించి ఎంతో ఆలోచిస్తారు. భారతీయులకు తక్కువ ధరకే కార్లను అందించాలనుకున్నారు. 1999లో నా కుమార్తెకు నాయకత్వ విలువలు, కఠిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై గంట క్లాస్ చెప్తానని 3 గంటలు తీసుకున్నారు. ఆయన మాటలు నాపైనా, నా కుటుంబంపైనా చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని అన్నారు.

Similar News

News October 18, 2024

ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్

image

TG: ప్రజెంటేషన్ పేరుతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. నిన్నటి సమావేశంలో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

News October 18, 2024

భారతీయులకు UAE ‘వీసా ఆన్ అరైవల్’.. కానీ..

image

భారత పాస్‌పోర్టు కలిగిన వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే ఆ దేశం వెళ్లిన తర్వాత తొలి 14 రోజులకు వీసా తీసుకోవచ్చు. ఆ తర్వాత పొడిగించుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం. USA వీసా, రెసిడెన్స్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డ్, ఈయూ-యూకే నుంచి వీసా, రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికే ఈ సౌకర్యాన్ని యూఏఈ కల్పించింది.

News October 18, 2024

పెళ్లికాని అమ్మాయిలు ఎల్లుండి ఇలా చేస్తే..

image

ఎల్లుండి(ఆదివారం) అట్లతద్ది. ఇది మహిళల పండుగ. ముఖ్యంగా పెళ్లికాని యువతులు మంచి భాగస్వామి రావాలని కోరుతూ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. గౌరీదేవిని పూజించి, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. పరమశివుడిని భర్తగా పొందాలని కోరుతూ గౌరీదేవి ఈ వ్రతం ఆచరించినట్లు పురాణాల గాథ. అటు పెళ్లయిన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షుతో జీవించాలని ఈ వ్రతం చేస్తారు. ఉత్తరాదిలో అట్లతద్దిని కర్వాచౌత్‌గా జరుపుకుంటారు.