News January 11, 2025

ఈవీలకు పన్ను రాయితీ

image

AP: రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్ కొని, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0(2024-2029)ని అమల్లోకి తీసుకొచ్చామని, ఇది ఉన్నంతకాలం ఈవీలపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. హైబ్రిడ్ 4 వీలర్స్‌కు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

Similar News

News December 6, 2025

అఖండ-2 వచ్చే ఏడాదేనా?

image

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుక్ మై షోలో 2026లో రిలీజ్ అని చూపించడంతో ఈ ఏడాది విడుదలకు అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. మరోవైపు క్రిస్మస్‌కు వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్’ మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ సంక్రాంతికి వస్తే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

News December 6, 2025

మద్యం అమ్మకాలు.. ఐదురోజుల్లో రూ.940 కోట్లు

image

TG: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు, కొత్త వైన్స్ ప్రారంభం కావడంతో అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 1-5 వరకు డిపో నుంచి ఏకంగా రూ.940 కోట్ల మద్యం లిఫ్ట్ అయ్యింది. DEC 1 నుంచి అమ్మకాలు చూస్తే.. రూ.183.05 కోట్లు, రూ.207.49 కోట్లు, రూ.187.52 కోట్లు, రూ.178.29 కోట్లు, రూ.185.02 కోట్ల బిజినెస్ జరిగింది. బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ము ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

News December 6, 2025

దైవ ప్రసాదంతో ఈ తప్పులు వద్దు

image

ప్రసాదం ఆహారం మాత్రమే కాదు. అది దైవాశీర్వాదం కూడా! మిగిలిన ప్రసాదాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు. ప్రసాదాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచాలి. ఇతరులకు పంచాకే తినాలి. ప్రసాదం చెడిపోయే వరకు నిల్వ ఉంచకూడదు. ఒకవేళ అలా జరిగితే.. చెత్త బుట్టల్లో అస్సలు పడేయకూడదు. బదులుగా చెట్టు, మొక్కల మొదట్లో ఉంచాలి. తీర్థాలను కూడా కింద పారబోయరాదు. నేరుగా తాగరాదు. చేతిలోకి తీసుకున్నాకే స్వీకరించాలి.