News July 11, 2024
ట్యాక్స్ వివాదం.. ₹50వేలు కడితే ₹1 వచ్చింది!

ఢిల్లీకి చెందిన అపూర్వ జైన్‌కు ఇన్‌కం ట్యాక్స్ నుంచి నోటీసులు రావడంతో CAను సంప్రదించారు. వివాదం పరిష్కరించేందుకు ₹50వేలు ఫీజు చెల్లించారు. రూ.లక్షల్లో పరిహారం వస్తుందనుకుంటే చివరికి ₹1 మాత్రమే దక్కింది. తీవ్ర నిరాశకు గురై విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న జైన్ ‘నేను జోక్ చేయట్లేదు’ అని రాసుకొచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. CA అంత ఛార్జ్ చేయకుండా ఉండాల్సిందని కొందరు అంటున్నారు.
Similar News
News November 15, 2025
ECపై ఆరోపణలను కొట్టిపారేయలేం: స్టాలిన్

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీ కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని తెలిపారు.
News November 15, 2025
రెండో రోజు CII సదస్సు ప్రారంభం

AP: విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న రేమండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు.
News November 15, 2025
తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

తన ఫ్యూచర్(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్‌రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్‌పై చాలా ఫోకస్డ్గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్‌పై అతనికున్న ఫోకస్‌ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.


