News July 11, 2024

ట్యాక్స్ వివాదం.. ₹50వేలు కడితే ₹1 వచ్చింది!

image

ఢిల్లీకి చెందిన అపూర్వ జైన్‌కు ఇన్‌కం ట్యాక్స్ నుంచి నోటీసులు రావడంతో CAను సంప్రదించారు. వివాదం పరిష్కరించేందుకు ₹50వేలు ఫీజు చెల్లించారు. రూ.లక్షల్లో పరిహారం వస్తుందనుకుంటే చివరికి ₹1 మాత్రమే దక్కింది. తీవ్ర నిరాశకు గురై విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న జైన్ ‘నేను జోక్ చేయట్లేదు’ అని రాసుకొచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. CA అంత ఛార్జ్ చేయకుండా ఉండాల్సిందని కొందరు అంటున్నారు.

Similar News

News January 19, 2025

ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లు తాగితే..

image

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి చర్మంపై ముడతలు తగ్గుతాయి.
SHARE IT

News January 19, 2025

U19 WC: నేడు ఇండియాVSవెస్టిండీస్

image

ICC ఉమెన్స్ U19 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్ వెస్టిండీస్‌తో తలపడనుంది. మ.12 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ TV ఛానల్స్‌లో చూడవచ్చు. IND కెప్టెన్‌గా నికి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్‌లో టాప్ రన్ స్కోరర్ గొంగడి త్రిష, టాప్ వికెట్ టేకర్ ఆయుషి శుక్లా జట్టులో ఉండటం భారత్‌కు బలం. కాగా నేడు జరిగే మరో మ్యాచులో SL, మలేషియా తలపడనున్నాయి.

News January 19, 2025

నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు

image

AP: వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు అధికారుల బృందం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడనుంచి జ్యూరిచ్ వెళ్లనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ పర్యటనలో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.76 కోట్లు రిలీజ్ చేసింది.