News March 9, 2025
వాణిజ్యం కోసమే ట్యాక్స్‌ల తగ్గింపు: భారత్

అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య బంధం బలోపేతానికే సుంకాలు తగ్గిస్తున్నట్లు భారత అధికార వర్గాలు తేల్చిచెప్పాయి. అమెరికా పన్నులు పెంచుతున్న నేపథ్యంలోనే ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు వస్తున్నవార్తలు అవాస్తవమన్నాయి. గతంలోనూ ద్వైపాక్షిక చర్చల అనంతరం పలు దేశాలకు భారత్ పన్నులు తగ్గించింది. అయితే భారత్ అత్యధిక సుంకాలు విధిస్తుందని తను ప్రకటించడంతోనే ట్యాక్స్‌లు తగ్గిస్తుందని ట్రంప్ ఆరోపించారు.
Similar News
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్‌డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.
News September 19, 2025
23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<