News January 10, 2025
పన్నుల వాటా.. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇలా
FY2024-25కు గాను పన్నుల వాటా కింద రాష్ట్రాలకు రూ.1,73,030 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా యూపీకి రూ.31,039 కోట్లు కేటాయించగా, ఏపీకి రూ.7,002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు దక్కాయి. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పనులకు ఈ నిధులను రిలీజ్ చేసింది. బిహార్‌కు రూ.17,403 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,582 కోట్లు, బెంగాల్‌కు రూ.13,017 కోట్లు కేటాయించింది.
Similar News
News January 10, 2025
FLASH: కేటీఆర్‌పై కేసు నమోదు
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-కార్ రేసు వ్యవహారంపై నిన్న ఏసీబీ అధికారులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
News January 10, 2025
స్పెలింగ్ ఎలా మర్చిపోతారు బ్రో!
లగ్జరీ బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌ను కాపీ చేస్తూ పేరులో స్పెలింగ్ మార్చి అమ్మేస్తుంటారు. అయితే, ఒరిజినల్ ప్రొడక్ట్ షాపు పేరులోనే స్పెలింగ్ తప్పుగా ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ PUMA షోరూమ్ పేరును PVMAగా ఏర్పాటుచేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది వినేందుకు హాస్యాస్పదంగా ఉన్నా.. సంస్థకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఫేక్ బ్రాండ్ అనుకొని కస్టమర్లు అటువైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు.
News January 10, 2025
బాలకృష్ణ, వెంకటేశ్ సినిమాలకు BIG SHOCK
AP: సంక్రాంతికి విడుదలయ్యే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల అదనపు షోలలో ప్రభుత్వం సవరణలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల షోలకు అనుమతి నిరాకరించింది. రోజుకు 5 షోలకు మించకుండా, అందులో ఒక బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చంది. దీంతో ఎల్లుండి రిలీజయ్యే డాకు మహారాజ్, 14న విడుదలయ్యే సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు 6వ షో ఉండదు. ఇది వసూళ్లపై ప్రభావం చూపనుంది.