News December 20, 2025
TCILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 5పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BE, B.Tech, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రిలిమినరీ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.tcil.net.in
Similar News
News December 30, 2025
తెలంగాణలో క్రైమ్ రేట్ తగ్గింది: DGP

TG: పోలీస్ వార్షిక నివేదిక-2025ను DGP శివధర్‌రెడ్డి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్‌రేట్ 2.33% తగ్గిందని వెల్లడించారు. 2025లో 782 హత్యలు జరిగాయని తెలిపారు. పోలీసులు సేవాభావంతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఈ ఏడాది 509మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా అల్లర్లు లేకుండా నిర్వహించామని, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, మెస్సీ పర్యటన విజయవంతమయ్యాయని వివరించారు.
News December 30, 2025
బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటిపళ్లు, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
News December 30, 2025
సిరియా కొత్త కరెన్సీ నోట్లను చూశారా?

సిరియా ఆర్థిక వ్యవస్థలో భారీ <<14825249>>మార్పులు<<>> చోటుచేసుకున్నాయి. జనవరి 1 నుంచి కొత్త సిరియన్ పౌండ్ నోట్లను చలామణిలోకి తెస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నోట్లపై ఉన్న బషర్ అల్-అసద్ చిత్రాలను పూర్తిగా తొలగించింది. నోట్లపై గోధుమలు, పత్తి, ఆలివ్స్, ఆరెంజ్ చిహ్నాలను ముద్రించింది. పాత కరెన్సీ విలువ కోల్పోవడంతో ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.


