News February 18, 2025

వీసా ఫ్రాడ్ ఆరోపణలు.. ఖండించిన TCS

image

దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లను US తీసుకెళ్లడానికి వారిని మేనేజర్లుగా చూపిస్తూ L-1A వీసాలను వాడుకుందని చెప్పారు. ఈ మేరకు అనిల్ కిని, మరో ఇద్దరు TCS మాజీ ఉద్యోగులు వ్యాజ్యాలు సైతం దాఖలు చేశారు. ఈ ఆరోపణలను ఖండించిన TCS తమ కంపెనీ US చట్టాలకు కట్టుబడి పని చేస్తుందని వెల్లడించింది.

Similar News

News October 29, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.

News October 29, 2025

LAYOFFS: లక్షల మంది ఉద్యోగుల తొలగింపు!

image

ఇటీవల మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. లేఆఫ్స్ ఇచ్చిన కంపెనీలివే.. UPSలో 48,000, అమెజాన్‌లో 30,000, ఇంటెల్‌లో 24,000, Nestleలో 16,000, యాక్సెంచర్‌లో 11,000, ఫోర్డ్‌లో 11,000, నోవో నార్డిస్క్‌లో 9,000, మైక్రోసాఫ్ట్‌లో 7,000, PwCలో 5,600, సేల్స్‌ఫోర్స్‌లో 4,000 ఉద్యోగాల తొలగింపు వార్తలు వచ్చాయి.

News October 29, 2025

CM చంద్రబాబు ఏరియల్ సర్వే

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్‌లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.