News April 12, 2024
టీసీఎస్ గుడ్‌న్యూస్.. వారికి డబుల్ ఇంక్రిమెంట్

దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ TCS లాభాలతో ఫుల్ జోష్‌లో ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 9.1% వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ.45,908 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తామని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. కాగా ప్రస్తుతం TCSలో 6.01లక్షల మంది పని చేస్తున్నారు.
Similar News
News January 9, 2026
భారత్‌కు వెనిజులా నుంచి క్రూడాయిల్?

రష్యా క్రూడాయిల్ కొనకుండా భారత్‌పై టారిఫ్స్‌తో అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కంట్రోల్‌లోని వెనిజులా చమురును ఇండియాకు అమ్మాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వెనిజులా ఆయిల్‌ను గ్లోబల్‌గా మార్కెట్ చేయాలని US యత్నిస్తోంది. ఇండియాకు అమ్మేందుకూ సిద్ధంగా ఉంది’ అని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. కాగా 50M బ్యారెళ్ల ఆయిల్‌ను వెనిజులా తమకు <<18798755>>అందజేస్తుందని<<>> ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.
News January 9, 2026
DGPకి హైకోర్టులో ఊరట

TG: DGP శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో DGP పూర్తిస్థాయి నియామకం జరగాలని UPSC సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
News January 9, 2026
టికెట్ రేట్ల పెంపు.. ఇరు వైపుల నుంచి విమర్శలు

‘Rajasaab’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. అఖండ2కు హైక్‌పై హైకోర్టు చీవాట్లతో ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నిసార్లు ప్రకటించి పక్కనబెడతారు అని ప్రజలు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ రిలీజ్ ఉంటే 8న అర్ధరాత్రి తర్వాత పర్మిషన్ వస్తే ఏం లాభమని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మీ Comment?


