News November 10, 2024
TCS: ఆఫీసుకొస్తేనే అధిక బోనస్

ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించేందుకు TCS బోనస్‌తో లింక్ పెట్టింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యాలయ హాజరు 85 శాతం పైన ఉన్నవారికి పూర్తి వేరియబుల్ పే అందుతుందని ప్రకటించింది. హాజరు 60-75 శాతం ఉంటే 50%, 75-85 శాతం ఉంటే 75% బోనస్ ఇస్తామని తెలిపింది. అదేసమయంలో సీనియర్ ఉద్యోగులు కొందరికి బోనస్‌లో 20-40%, మరికొందరికి 100% కోత విధించినట్లు సమాచారం.
Similar News
News January 18, 2026
2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్‌తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
News January 18, 2026
నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<


