News September 20, 2024
బ్రాండ్ విలువలో TCS మరోసారి నంబర్-1

దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా TCS వరుసగా మూడో ఏడాది గుర్తింపు పొందింది. $49.7 బిలియన్ల విలువతో అగ్రస్థానంలో నిలిచినట్లు Kantar BrandZ రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో HDFC బ్యాంక్($38.3bn), ఎయిర్టెల్($29.86bn), ఇన్ఫోసిస్($25.22bn), SBI($17.98bn), ICICI బ్యాంక్($15.60bn), జియో($13.74bn), ఏషియన్ పెయింట్స్($13.56bn), HCL టెక్($11.82bn), LIC($11.50bn) ఉన్నాయి.
Similar News
News December 15, 2025
ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్‌లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్‌లో రూ.0.82గా ఉంది.
News December 15, 2025
ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హుడు: SC

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్కీ తేడా ఉంది. రిజైన్తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.
News December 15, 2025
విద్యార్థులకు వేడి ఆహారమే ఇవ్వాలి: మంత్రి

AP: చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని బీసీ సంక్షేమ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, గదుల్లో దోమలు చొరబడకుండా తెరలు వాడాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, ఆ తరువాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని ఉన్నతాధికారుల సమీక్షలో తెలిపారు.


