News July 12, 2024

వేరియబుల్ పేను అటెండెన్స్‌కు లింక్ చేసిన TCS

image

వర్క్ ఫ్రమ్ హోమ్‌ వదిలి ఆఫీసుకు రావాలని TCS ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించినా ఇంకా చాలా మంది రావట్లేదు. ఈక్రమంలో వేరియబుల్ పేను అంటెండెన్స్‌కు లింక్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో 70శాతానికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నట్లు చీఫ్ HR మిలింద్ లక్కడ్ తెలిపారు. ఉద్యోగులు కనీసం 85 శాతం హాజరు ఉంటేనే పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందుతారు. 60% కంటే తక్కువ హాజరు ఉంటే బోనసే రాదు.

Similar News

News December 27, 2025

అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

image

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.

News December 27, 2025

ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

image

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.

News December 27, 2025

CBSEలో 124 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

CBSEలో 124 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, Jr. ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, Jr. అకౌంటెంట్, Jr. అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, డిగ్రీ, PG, B.Ed/M.Ed, NET/SET, PhD, MBA, CA, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.cbse.gov.in