News July 11, 2024
TCS లాభం రూ.12వేల కోట్లు.. కొత్త ఉద్యోగులు 5,452 మంది

FY2024-25 Q1లో 8.7% వృద్ధితో రూ.12,040 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు TCS వెల్లడించింది. మొత్తం ఆదాయం 5.4 శాతం వృద్ధితో రూ.62,613 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. గత 3 నెలల్లో 5,452 మందిని కొత్తగా నియమించుకున్నట్లు వివరించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరినట్లు తెలిపింది. వీరిని 151 దేశాల నుంచి రిక్రూట్ చేసుకున్నామంది. ఉద్యోగుల్లో 35.5 శాతం మహిళలు ఉన్నారని వెల్లడించింది.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


