News February 10, 2025
TDPలోకి చేరనున్న ఆళ్ల నాని

ఏలూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని TDPలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం(నేడు) పచ్చ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 16, 2025
నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ప్రధాని

నేడు శ్రీశైలం మల్లన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. ఉదయం 11:15 ని శ్రీశైలంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
News October 16, 2025
వనపర్తి: 24 గంటలు నమోదైన వర్షపాత వివరాలు

వనపర్తి జిల్లాలో ఉన్న 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటలో నాలుగు కేంద్రాలలో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జానంపేటలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శ్రీరంగాపురం 6.8 మిల్లీమీటర్లు, పెబ్బేరు 4.8 మిల్లీమీటర్లు, దగడలో 1.8 మిల్లీమీటర్లు, మిగతా 17 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 16, 2025
ఇంటర్ విద్యార్థులు వివరాలు సరిచూసుకోవాలి: DIEO

ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఆన్లైన్ చెక్ లిస్టులతో సరిచూసుకోవాలని DIEO రాందాస్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఈ సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింక్ ద్వారా నేరుగా తమ వివరాలు, ఫొటో, సంతకం వంటివి పరిశీలించుకోవచ్చన్నారు. ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.