News February 10, 2025
TDPలోకి చేరనున్న ఆళ్ల నాని

ఏలూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని TDPలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం(నేడు) పచ్చ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 4, 2025
పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ శ్రీజ

రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. హాజరు శాతం 90కి పైగా ఉండేలా తల్లిదండ్రులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.
News November 4, 2025
దెందులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

దెందులూరు మండలం సత్యనారాయణపురం 16 నంబర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్ఐ శివాజీ మంగళవారం తెలిపారు. ఏలూరు గుండుగొలను మార్గంలో సత్యనారాయణపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు దెందులూరు పోలీసులకు తెలియజేయాలన్నారు.
News November 4, 2025
మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష

జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితమైన వివరాలను సమయానికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.


