News September 20, 2025

TDPలో చేరిన MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి

image

MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది వరకే ఆయన YCPకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు CM చంద్రబాబు కండువా కప్పి TDPలోకి ఆహ్వానించారు. సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన వెంట సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, పులివర్తి నాని ఉన్నారు.

Similar News

News September 20, 2025

డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

image

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News September 20, 2025

న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.3.8 కోట్లు వసూలు

image

నాగర్‌కర్నూల్ (TG) జిల్లాకు చెందిన మల్లేశ్, భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ Xలో ‘సంయుక్త రెడ్డి’ పేరిట అకౌంట్ క్రియేట్ చేశారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని పరిచయం చేసుకుని న్యూడ్ వీడియోలు పంపారు. ఓ మహిళతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించారు. ఆ తర్వాత తక్కువ ధరకే పొలాలు, ప్లాట్లు అమ్ముతామని నమ్మించారు. దాంతో పాటు బెదిరించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు వసూలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

News September 20, 2025

నేడు విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు స్పాట్ అడ్మిషన్లు

image

వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులోని తెలుగు యూనివర్సిటీ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు అడ్మిషన్ల కోసం శనివారం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.