News November 7, 2024

TDP కార్యకర్తను చంపేందుకు కుట్ర: యాగంటి

image

దుర్గి మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త గోకుల గౌరీ యాదవ్ ను శ్యామరాజపురం, జమ్మలమడక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు హత్య చేసేందుకు 2 రోజుల క్రితం కుట్ర పన్నారని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆరోపించారు. బాధితుడిని గురువారం పరామర్శించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో MLA జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు వైసీపీ వారు పాల్పడితే తాట తీస్తామన్నారు.

Similar News

News December 13, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

image

అమరావతి: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా వర్షాలు పడుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని రకాల ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.

News December 13, 2024

ప్రేమ్ కుమార్ అరెస్టు అక్రమం : వైఎస్ జగన్

image

గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను గురువారం వైఎస్ జగన్ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కలిశారు. అరెస్టు జరిగిన విధానాన్ని విని అక్రమ అరెస్టును ఖండిస్తున్నానని, అతనికి కావలసిన న్యాయసహాయాన్ని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నగర మేయర్ మనోహర్, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

News December 12, 2024

పేరేచర్ల: భార్యను చూడటానికి వెళ్తూ ప్రమాదం.. మృతి

image

మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల-నర్సరావుపేట మార్గంలో వాహనం అదుపు తప్పడంతో మరణించిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన నన్నం విజయ్ కుమార్ (35) గా గుర్తించారు. గుంటూరులో హాస్పటల్‌లో ఉన్న తన భార్య చూడటానికి వెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి వంతెనలోకి పడటంతో విజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.