News August 25, 2024
TDP నేతల వేధింపులు: వైసీపీ మహిళా కార్యకర్త

TDP సోషల్ మీడియా వారు తనను వేధిస్తున్నారని YCP స్పోక్స్ పర్సన్ సుచిత్ర విజయవాడ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. YCP సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నానని.. TDP సోషల్ మీడియాలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారన్నారు. TDP సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని తెలిపారు. అంతేకాకుండా తనను రేప్ చేస్తానని బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
Similar News
News January 23, 2026
ముఖ్యమంత్రిని కలిసిన గన్నవరం ఎమ్మెల్యే

దావోస్ పర్యటన ముగించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఉండవల్లికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన సీఎంకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహచరులతో కలిసి ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కి పైగా కీలక సమావేశాల్లో పాల్గొని ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులతో చర్చలు జరిపారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
News January 23, 2026
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్నవరం రాక

హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కేంద్ర గనులు మరియు బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గుడివాడ ఆర్‌డీఓ జి. బాల సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి విజయవాడ వైపు బయలుదేరి వెళ్లారు.
News January 23, 2026
కృష్ణా: ఈ శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి 28,740 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,215 పోస్టులు కేటాయించగా, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 27 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు.


