News March 22, 2024
TDP లిస్ట్.. అమలాపురం, కాకినాడ సిటీ అభ్యర్థులు వీరే!

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. అమలాపురం MLA అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ సిటీ MLA అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావును అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్.. కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా.. 2019లోనూ ఈ రెండు చోట్ల వీరే ప్రత్యర్థులు కాగా, ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.
Similar News
News November 3, 2025
మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News November 3, 2025
నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె సూచించారు. ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 2, 2025
1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.


