News December 21, 2025

TDP అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి

image

అందరూ ఊహించినట్లే టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు నియమితులయ్యారు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో నడుస్తోంది. వారి సేవలను గుర్తించి ప్రసాద్ బాబుకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ ఖాన్‌కు అవకాశం దక్కింది.

Similar News

News December 23, 2025

వారు ఆ టైంలోనే తిరుమలకు రావాలి: BR నాయుడు

image

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘DEC 30 నుంచి JAN 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నాం. 10 రోజులలో మొత్తం 182గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.

News December 23, 2025

ఉష్ణోగ్రత ఎంత ఉంటే.. చలి అంత ఉన్నట్టా?

image

ఉష్ణోగ్రత ఎంత తగ్గితే చలి తీవ్రత అంత ఎక్కువ అవుతుందనేది ఒకింత నిజమే. అయితే టెంపరేచర్ ఒక్కటే చలిని నిర్ణయించదు. వాతావరణంలోని తేమ, ఎండ.. ముఖ్యంగా గాలి వేగం ప్రభావితం చేస్తాయి. థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత కంటే గాలి వేగం ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి త్వరగా పోయి మరింత చల్లగా అనిపిస్తుంది. ఉదాహరణకు గాలి లేకుండా 0°C ఉంటే చల్లగా ఉంటుంది. అదే 0°Cకి 40kmph గాలి కలిస్తే -10°C లాగా అనిపిస్తుంది.

News December 23, 2025

ఆదిలాబాద్: INTER విద్యార్థులకు గమనిక

image

ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించని వారికి బోర్డు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 16తోనే ఫీజు చెల్లింపు గడువు ముగియగా దానిని ఈ నెల 31 వరకు అపరాధ రుసుము రూ.2000తో పొడగించినట్లు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు.
SHARE IT..