News March 23, 2024

TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు హరీశే

image

ఈసారి TDP అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు మన అమలాపురం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయనే గంటి హరీశ్ మాధుర్(33). 12వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి-మాజీ ఎంపీ విజయకుమారి దంపతుల కుమారుడు హరీశ్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారైంది. స్వగ్రామం ఐ.పోలవరం మండలం ఎదుర్లంక. BBM చదివిన ఈయన.. 2019లోనూ ఇక్కడే MPగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి మళ్లీ ఆయనే టికెట్ దక్కించుకున్నారు.

Similar News

News February 21, 2026

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలోని గ్రామపంచాయితీల పరిధిలో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ.125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.54.00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించాలన్నారు.

News February 21, 2026

రాజమండ్రి: టెన్త్‌తో ఉద్యోగాలు..19-35 ఏళ్లు వారే అర్హులు

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 19-35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

News February 21, 2026

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

image

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.