News September 29, 2024

TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?

image

TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్‌‌తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.

Similar News

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.

News November 24, 2025

ప.గో జిల్లాలో 70 మందికి అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి

image

ప.గో జిల్లాలో పని చేస్తున్న 70 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్ గ్రేడ్ చేసినట్లు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ అన్నారు. ఉండి నియోజకవర్గంలో 13 మందికి పదోన్నతి లభించిందన్నారు. సోమవారం పెద అమిరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్తర్వులను అందించారు. వీరికి వేతనం రూ 7. వేలు – రూ .11,500కి పెరుగుతుందన్నారు.

News November 24, 2025

భీమవరం: 3,000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.