News December 16, 2025

TDP బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగలకు మరో అవకాశం..?

image

TDP బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ బాబుకు మరోసారి అవకాశం రానుందని జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసిన సలగల బెంజిమెన్ కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కూటమి ప్రభుత్వం విజయం అనంతరం ప్రస్తుతం బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Similar News

News December 19, 2025

జనగామ కలెక్టరేట్ వద్ద సర్పంచ్ అభ్యర్థి నిరసన

image

జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు కొడకండ్ల మండలం నీలిబండ తండా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ సురేష్ ఆధ్వర్యంలో తండా వాసులు నిరసన తెలిపారు. 3వ విడతలో జరిగిన నీలిబండ తండా సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని సురేష్ ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు.

News December 19, 2025

కరీంనగర్‌లో ఈనెల 24న కిసాన్ గ్రామీణ మేళా

image

డిసెంబర్ 24 నుంచి 26 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ గ్రామీణ మేళా అధ్యక్షులు పి.సుగుణాకర్ రావు తెలిపారు. ఈ మేళాలో రైతులకు కొన్ని కంపెనీల విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రైతులకు తక్కువ ధరలో లభిస్తాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ ప్రదర్శన కార్యక్రమాలు ఉన్నందున జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News December 19, 2025

మన కోరికలకు 108కి ఏంటి సంబంధం?

image

మనిషికి సాధారణంగా 108 భూసంబంధమైన కోరికలు, 108 రకాల భావాలు ఉంటాయని నమ్మకం. ఈ 108 భావాలలో 36 గతానికి, 36 వర్తమానానికి, మిగిలిన 36 భవిష్యత్తుకు సంబంధించినవిగా భావిస్తారు. అలాగే శరీరానికి జీవాన్నిచ్చే మర్మ బిందువుల సంఖ్య కూడా నూట ఎనిమిదే. ఈ 108 కోరికలు, భావాలు, మర్మ బిందువులపై నియంత్రణ సాధించినప్పుడు, మనం కోరికల బంధం నుంచి విముక్తి పొంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయి.