News March 27, 2024
పవన్ కళ్యాణ్‌ను కలిసిన టీడీపీ, బీజేపీ నేతలు

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పలువురు టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఇవాళ మంగళగిరిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వీరి వెంట ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. అలాగే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్‌ను కలిశారు. ఎన్నికల్లో తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వీరు కోరినట్లు తెలుస్తోంది.
Similar News
News March 31, 2026
గుడ్ న్యూస్: ‘చేనేత’కు రేపట్నుంచి ‘ఫ్రీ పవర్’

AP: చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకం రేపట్నుంచి అమలు కానుంది. నెలకు మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల చొప్పున GOVT ఫ్రీగా అందించనుంది. ఇందుకు ఏడాదికి దాదాపు ₹150CR వెచ్చించనుంది. 93,000 మగ్గాల కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ ఫ్యామిలీలకు లబ్ధి కలుగుతుంది. ఏడాదికి ఒక్కో మగ్గం యూనిట్‌కు రూ.8,640 వరకు, పవర్ లూమ్ యూనిట్‌కు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
News March 31, 2026
కలెక్షన్ల సునామీ.. చరిత్ర సృష్టించిన ధురంధర్-2!

‘ధురంధర్-2’ రూ.1,390CR(గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ పార్ట్ లైఫ్‌టైమ్ వసూళ్ల(రూ.1,350CR)ను 12 రోజుల్లోనే అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల లిస్టులో 4వ స్థానానికి చేరింది. తొలి 3 స్థానాల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 ఉన్నాయి. ఇక కర్ణాటకలో రూ.100+CR సాధించిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది.
-ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.
News March 31, 2026
వందే భారత్‌లో ఫుడ్.. అలెర్జీకి గురైన యువతి ఫొటో వైరల్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో <<19481891>>ఫుడ్<<>> తిన్న తర్వాత అలెర్జీకి గురైనట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. పెదవులు ఉబ్బిపోయిన ఫొటో, మెడికల్ బిల్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలవుతున్నాయి. ‘వందే భారత్‌లో ఇచ్చే ఆహారం అత్యంత నాసిరకం. ఫిర్యాదు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు’ అని ఆమె వాపోయారు. తన బిడ్డతో కలిసి దేవ్‌గఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.


