News May 26, 2024
పిన్నెల్లి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని

AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఆ పార్టీ కుట్రలకు కొందరు పోలీసులు, అధికారుల సహకారం ఉందని, అందుకే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ కూడా కూటమి నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తోందన్నారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


