News April 19, 2024
ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫాంలు

AP: TDP చీఫ్ చంద్రబాబు ఈనెల 21న అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 144 మంది అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బాబు స్వయంగా వాటిని అందజేస్తారు. అనంతరం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, మిత్రపక్షాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు 2,3 చోట్ల అభ్యర్థుల మార్పుపై కసరత్తు చేస్తున్న బాబు.. అదేరోజు కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.
News November 27, 2025
వైట్ ఎగ్స్‌కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్‌ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
News November 27, 2025
బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.


