News June 4, 2024

వెయ్యి ఓట్లతో గెలిచిన టీడీపీ అభ్యర్థి

image

AP: గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌ రెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. ఆయన తన సమీప అభ్యర్థి కందూరు నాగార్జునరెడ్డి(వైసీసీ)పై 1,080 ఓట్ల తేడాతో గెలుపొందారు. అటు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి 6,880 మెజార్టీతో విజయం సాధించారు.

Similar News

News November 17, 2025

నెల్లూరు జిల్లాలో 10th విద్యార్థులకు అపార్ గండం

image

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 10th విద్యార్థులకు గండంగా మారింది. NEP ప్రకారం విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉండాలి. స్కూల్ రికార్డ్‌లోని వివరాలు, విద్యార్థి ఆధార్ వివరాలు అక్షరం తప్పు లేకుండా సరిపోయిన విద్యార్థులకు APAAR. ID, PEN లభిస్తాయి. అవి ఉంటేనే 10th పరీక్ష ఫీజు చెల్లింపు అవుతుంది. వేల మంది విద్యార్థులకు ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉంది.

News November 17, 2025

చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

image

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్‌ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.