News June 4, 2024
25 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపు

AP: రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు తన సమీప ప్రత్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 78347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకి 78,322 ఓట్లు నమోదయ్యాయి.
Similar News
News December 1, 2025
హసీనాపై మరో కేసు! భారత్‌పైనా ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18408910>>షేక్ హసీనా<<>>పై మరో కేసు పెట్టేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనా కారణమని చెబుతోంది. ఆ హింసాకాండలో భారత్ ప్రమేయం కూడా ఉందని అక్కడి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో పేర్కొంది. బంగ్లా ఆర్మీని బలహీనపరిచేందుకు ఆ హింసకు భారత్ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తోంది. 2009 హింసాకాండలో సీనియర్ ఆర్మీ అధికారులు సహా 74 మంది మరణించారు.
News December 1, 2025
POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.
News December 1, 2025
ఈ కాల్స్/మెసేజ్‌లను నమ్మకండి: పోలీసులు

పార్సిల్లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్‌లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.


