News October 28, 2024
జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లికీ వద్దని Xలో రాసుకొచ్చింది. ‘వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మని దింపేసిన సైకో కొడుకు జగన్ ఆమెను ఇంట్లోంచి కూడా గెంటేశాడు. ఇప్పుడు ఏకంగా కేసు పెట్టి కోర్టుకి లాగాడు. 70 ఏళ్ల వయసులో ఏ తల్లికీ ఇంత క్షోభ ఉండదు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News January 20, 2026
మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.
News January 20, 2026
సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.
News January 20, 2026
నం.3లో ఇషాన్ కిషన్ ఆడతారు: సూర్య

రేపు NZతో జరిగే తొలి T20లో ఇషాన్ కిషన్ నం.3లో బ్యాటింగ్ చేస్తారని కెప్టెన్ SKY తెలిపారు. శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి అతను అర్హుడన్నారు. మరోవైపు తన ఆటతీరులో మార్పు ఉండదని, గతంలో మాదిరే బ్యాటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి NZతో IND 5 మ్యాచుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో 7PMకు ప్రారంభమవుతుంది. JIO హాట్‌స్టార్, స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో LIVE చూడొచ్చు.


