News July 5, 2024
నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై టీడీపీ కసరత్తు

AP: పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల కేటాయింపుపై TDP కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని ఏ సెగ్మెంట్లో ఎవరు ఎలా పనిచేశారు? దాడులకు గురైన వారెవరు? అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ఈ నెల 8లోపు పంపాలని GAD ఆదేశించింది. అలాగే సొసైటీల్లోని ఖాళీల వివరాలనూ పంపాలని సూచించింది.
Similar News
News December 16, 2025
ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్నాథ్ రెడ్డి ఛైర్మన్గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.
News December 16, 2025
CLAT-2026 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <
News December 16, 2025
కోడి గీతలతో YCP కోటి సంతకాల డ్రామా: సత్యకుమార్

AP: మెడికల్ కాలేజీల విషయంలో ప్రజా మద్దతు లేక YCP చీఫ్ జగన్ కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 10 వైద్య కళాశాలలను PPP విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్ దాన్ని ప్రైవేటీకరణగా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, కోర్టులు PPPని సమర్థించాయని, దీనిపై ఆయన కోర్టుకెళ్తేనే మేలని చెప్పారు.


