News June 4, 2024
లక్షన్నర ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఫైర్‌బ్రాండ్ పెమ్మసాని

AP: ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు మెజార్టీ దిశగా వెళ్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు 3,44,736 ఓట్లు పోలవగా.. 1,58,185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడ్డ ఈ ఎన్నారై.. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు ఇప్పటివరకు 1,86,551 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News November 20, 2025
ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.
News November 20, 2025
తిరుమలలో గంటల శబ్దం వచ్చేది ఇక్కడి నుంచే..

తిరుమల వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ గంటలున్న మండపాన్ని తిరుమామణి అని అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు గంటలు ఉంటాయి. మొదటిది నారాయణ గంట. రెండవది గోవింద గంట. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ మండపాన్ని సామాన్య శకం 1417వ సంవత్సరంలో మాధవదాసు అనే భక్తుడు నిర్మించాడు. స్వామివారి నివేదన వేళ ఆయన్ను స్మరించుకోవడానికి ఈ మండపం ఒక ముఖ్యమైన భాగం. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 20, 2025
చట్టప్రకారమే KTRపై చర్యలు: మహేశ్ గౌడ్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో KTR తప్పు చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘BRS హయాంలో జరిగిన ప్రజాధన దోపిడీని సరిచేస్తుందనే కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. అందుకే అన్నింటిపై కమిషన్లు వేశాం. రూల్స్ అతిక్రమించి KTR ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తికి పంపారని కమిషన్ రిపోర్టులో ఉంది. అప్పటి మంత్రిగా ఆయన తప్పు ఒప్పుకోవాలి. గవర్నర్ అనుమతించారు కాబట్టి చట్టం తనపని తాను చేస్తుంది’ అని తెలిపారు.


