News March 29, 2025

TDP ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది: పవన్

image

AP: TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు, పార్టీ నేతలు, కార్యకర్తలకు Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉమ్మడి APలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా 1982లో TDPని NTR స్థాపించారు. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలబడింది. భవిష్యత్తులోనూ మరింత నిబద్ధతతో ఇలాగే ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.in‌లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.

News November 13, 2025

కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

image

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.

News November 13, 2025

శివుడికి మూడో నేత్రం నిజంగానే ఉంటుందా?

image

శివుడికి మూడో నేత్రం ఉంటుంది. కానీ, చిత్రపటాల్లో చూపించినట్లు అది భౌతికమైనది కాదు. ఆ నేత్రం జ్ఞానానికి, అంతర దృష్టికి సంకేతం. దాని ద్వారానే ఆయన లోకాలను నడిపిస్తున్నాడు. ఆయన అంతటి జ్ఞానవంతుడని తెలిపేందుకే విగ్రహాలు, ఫొటోల్లో ఆ నేత్రాన్ని చూపిస్తారు. జ్ఞానం అనే ఈ మూడో కన్ను మనక్కూడా ఉంటుందని, దాని ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్షం వైపు అడుగులేస్తారని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#SIVA<<>>