News October 7, 2025

జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

image

TG: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నేడు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.

Similar News

News March 25, 2026

టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరైన ఏపీ, టీజీ సీఎంలు

image

AP: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వైదీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. గుంటూరులో జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌తో రేవంత్ ముచ్చటించారు.

యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు: జగన్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం పేరుతో నిత్యావసరాల ధరలు పెంచేసిందని జగన్ ఆరోపించారు. ‘వంట నూనెలు కేజీకి ₹40, పప్పుల ధరలు కేజీకి ₹15+ పెంచేశారు. సిలిండర్లను బ్లాక్‌లో ₹2000-3000కు అమ్ముతున్నారు. ఇప్పుడు కిరోసిన్ ఇస్తామంటున్నారు’ అని విమర్శించారు. ‘మా హయాంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఆహ్వానించి భూములు చూపించాం. ఇప్పుడు CBN క్రెడిట్ చోరీ చేస్తున్నారు’ అని అద్దంకి నేతలతో భేటీలో పేర్కొన్నారు.