News April 12, 2024
రాజంపేటలో రెండు వర్గాలుగా టీడీపీ

AP: కడప జిల్లా రాజంపేటలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. టికెట్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వడాన్ని పార్టీ సీనియర్ నేత బత్యాల చెంగల్రాయుడు వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో సుగవాసిని వ్యతిరేకిస్తూ బత్యాల సొంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీలోని రెండు వర్గాలు వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో కేడర్‌లో అయోమయం నెలకొంది.
Similar News
News January 15, 2026
‘జైలర్-2’లో విజయ్ సేతుపతి

రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్నట్లు విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. గతంలో ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ఆయన స్థానంలో సేతుపతిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల హింట్ ఇచ్చారు.
News January 15, 2026
బంగ్లా క్రికెట్‌లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.
News January 15, 2026
MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<


