News June 5, 2024

కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ?

image

NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న TDP కేంద్ర కేబినెట్‌లో 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 16 MP సీట్లతో BJP తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న TDP.. లోక్‌సభ స్పీకర్‌ పదవితో పాటు రవాణా, వ్యవసాయం, జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి, హెల్త్ శాఖలను కోరుతున్నట్లు సమాచారం. సాయంత్రం జరగనున్న NDA సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది.

Similar News

News November 21, 2025

‘వస్త్ర పరిశ్రమ సాధికారత.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక’

image

ఇందిరా మహిళ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతుందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యతను చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.