News June 6, 2024

టీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: YS జగన్

image

ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. YCP కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.

Similar News

News December 31, 2025

Khaleda Zia: ఇండియాలో పుట్టి.. ఇండియా వ్యతిరేకిగా మారి..

image

బంగ్లాదేశ్ Ex PM <<18709090>>ఖలీదా జియా<<>>(80) నిన్న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో పుట్టిన ఆమె భారత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. PMగా పదేళ్లలో గంగా జలాలు, వలసదారులు వంటి ఎన్నో అంశాల్లో మనతో ఘర్షణలకు దిగారు. భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాలో ఆశ్రయమిచ్చారు. పాక్, చైనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నాడు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి. హసీనా హయాంలో పరిస్థితి మారింది.

News December 31, 2025

షమీ విషయంలో BCCI యూ టర్న్?

image

చాలా కాలంగా <<18208828>>పక్కన పెట్టిన<<>> భారత బౌలర్ మహ్మద్ షమీ విషయంలో BCCI యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 ODI వరల్డ్ కప్ కోసం సెలక్టర్లు అతడిని పరిశీలిస్తున్నట్లు NDTV తెలిపింది. షమీ దేశవాళీ ప్రదర్శనను ట్రాక్ చేస్తున్నారని, పునరాగమనం దగ్గర్లోనే ఉందని BCCI వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయొచ్చని చెప్పింది. కేవలం అతడి ఫిట్‌నెస్ గురించే బోర్డు ఆలోచిస్తున్నట్లు వివరించింది.

News December 31, 2025

జపాన్‌ను దాటేసి.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

image

భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన ఎకానమీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 లోపు జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లలో 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని తెలిపింది. 2025-26 రెండో క్వార్టర్‌లో రియల్ GDP 8.2% వృద్ధి చెందిందని వెల్లడించింది.