News August 29, 2024
టీడీపీ పరోక్షంగా ఎంపీలను కొనుగోలు చేస్తోంది: కాకాణి

AP: ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం TDPకి అలవాటేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ పరోక్షంగా MPలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ‘జగన్ నాయకత్వాన్ని దెబ్బతీయాలని, YCPని భూస్థాపితం చేయాలని కుట్ర చేస్తున్నారు. ఒకరిద్దరు MPలు వెళ్తే వచ్చే నష్టమేమీ లేదు. ఇన్ని రోజులు ఎవరినీ పార్టీలో చేర్చుకోబోమని CBN అన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చడానికి చేర్చుకుంటున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News October 26, 2025
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

APPSC విడుదల చేసిన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (3), రాయల్టీ ఇన్స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, BSc, BEd, MA, BSc(జియోలజీ), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/
News October 26, 2025
విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు సీఎం ఆదేశం

AP: తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, ఎక్కడా ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. SMS, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్, టెలికం, తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు <<18106376>>సెలవులు<<>> ప్రకటించాలని టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు.
News October 26, 2025
మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలుఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మసమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.


